Aqua Exchange Aqua Exchange

ఆక్వాఎక్స్చేంజ్ పవర్మాన్ సెట్ లీజు ఒప్పంద పత్రము

ఇ పవర్మాన్ సెట్ లీజు ఒప్పందము "కస్టమర్" ("వీరు ఇప్పటి నుండి వినియోగదారులు లేదా కస్టమర్ అని పిలవబడతారు అనగా కస్టమర్ యొక్క ఉద్యోగి, కన్సల్టెంట్ లేదా కాంట్రాక్టర్ తో సహా అందరు కస్టమర్ గానే పిలవబడతారు") మరియు ఆక్వా ఎక్సేంజ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్డ్ కార్యాలయం, 9-1-45/3/2 వరుణ్ రెసిడెన్సీ, న్యూరేసపువానిపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, 530013 మరియు వారి యొక్క మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆక్వా ఎక్సేంజ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ RS నెంబరు93/1, ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు పక్కన, బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్, వీరవల్లి, ఆంధ్రప్రదేశ్, 521110. లు ("వీరు ఇప్పటి నుండి "కంపెనీ " లేదా"ఆక్వా ఎక్స్ఛేంజ్" అని పిలువబడతారు") ల మద్య జరిగిన అంగీకార ఒప్పందము.

ఆక్వాఎక్స్చేంజ్ "నెక్ట్స్ ఆక్వా" బ్రాండ్ పేరుతో ఐఓటి (IOT) ఆక్వా ఫార్మ్ ఆటోమేషన్ మరియు పర్యవేక్షణ (మానిటరింగ్) పరికరాలను ("ఎక్విప్మెంట్" లేదా "డివైజెస్" అని పిలవబడతాయి") ను అభివృద్ధి, తయారు, మరియు మార్కెట్ చేస్తుంది. వివిధ ఆక్వా ఫార్మ్ కార్యకలాపాలను ఆటోమేట్ చేయడం మరియు పర్యవేక్షించడం కొరకు ఈ పరికరాలు6 నెలల ఆపరేటింగ్ లీజు ప్రాతిపదికన కస్టమర్ లకు అందించబడతాయి.

కస్టమర్ ఆక్వాఎక్స్చేంజ్ పరికరాలను ఉపయోగించాలని కోరుకున్నపుడు ఫార్మ్ మానిటరింగ్ మరియు ఆటోమేషన్ ప్రయోజనాలను వినియోగదారులకు అందించుట కొరకుఆపరేటింగ్ లీజు 6 నెలల ప్రాతిపదికన ఆక్వాఎక్స్చేంజ్ ఈపరికరాలను కస్టమర్ వినియోగించుకోడానికి అనుమతి ఇస్తుంది.

లీజు కాలపరిమితి

ఆపరేటింగ్ లీజు ప్రాతిపదికన కస్టమర్ కు అందించబడ్డ ఆక్వాఎక్స్చేంజ్ డివైజెస్ కస్టమర్ ఆవరణలో అమర్చబడిన తేదీ నుంచి కనీసం 6 (ఆరు) నెలల పాటు లీజుకు ఇవ్వబడతాయి. సర్వీసును నిలిపివేయాలనే ఉద్దేశాన్ని ఇరు పక్షాలు నోటీసు ద్వారా ప్రస్తుత లీజు ఒప్పందం ముగియడానికి ఏడు (7) రోజుల ముందు తెలియపరచవచ్చు. ఇట్లు తెలియపరచని ఎడల లీజు స్వయంచాలకంగా(ఆటోమేటిక్ గా) తదుపరి 6 (ఆరు) నెలల కాలానికి 'పునరుద్ధరించబడుతుంది'.

ఎక్విప్ మెంట్ యొక్క యాజమాన్యము

లీజుకు తీసుకున్న పరికరాలపై సర్వ హక్కులు, మరియు టైటిల్ అన్నివేళలా ఈ ఒప్పందం కాలవ్యవధిలో కంపెనీ యొక్క ఆస్తిగా ఉంటాయని స్పష్టంగా అంగీకరించబడింది మరియు అర్థం చేసుకోబడింది. ఈ డివైజెస్ లను ఆక్వాఎక్స్చేంజ్ కంపెనీ అనుమతి లేకుండా కదిలించడం లేదా ట్యాంపరింగ్ చేయరాదని కస్టమర్ కు తెలియచేయటం జరిగింది మరియు వారు దానికి అంగీకారాన్ని తెలియచేసారు. సేవలను నిలిపివేసిన తరువాత లేదా నిలుపుదల తరువాత, కస్టమర్ డివైజెస్ ను సరైన పని చేసే స్థితిలో వాటి హక్కుదారులైన ఆక్వాఎక్స్చేంజ్ వారికీ తిరిగి ఇవ్వాడానికి అంగీకరించారు.

కస్టమర్ ఆవరణలో అమర్చబడిన మరియు ఉపయోగించుచున్నలీజు డివైజెస్ ను తనిఖీ చేసే హక్కు ఆక్వాఎక్స్చేంజ్ ఉద్యోగులకు లీజు కాలంలో ఏ సమయంలోనైనా ఉంటుంది. మరియు అటువంటి తనిఖీ సమయంలో ఆక్వాఎక్స్చేంజ్ ద్వారా నిర్ణయించబడిన విధంగా ఉపయోగించని లేదా పేలవమైన స్థితిలో ఉన్న ఏవైనా పరికరాలను తిరిగి స్వాధీనము చేసుకొను హక్కు ఆక్వాఎక్స్చేంజ్ ఎల్లవేళలా కలిగి ఉంటుంది.

కస్టమర్ బాధ్యతలు

లీజు కాలవ్యవధిలో, ఆక్వాఎక్స్చేంజ్ యొక్క ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా లీజుకు తీసుకున్న డివైజెస్ ను మొదట ఉపయోగించిన లేదా ఇన్ స్టలేషన్ స్థానం నుండి తరలించకుండా ఉంచడానికి కస్టమర్ స్పష్టంగా అంగీకరించారు. అంతేకాక, ఆక్వాఎక్స్చేంజ్ యొక్క రాతపూర్వక అనుమతి లేకుండా డివైజెస్ ను సబ్-లీజుకు ఇవ్వడం, ట్యాంపరింగ్ చేయడం లేదా మూడవ పక్షము (థర్డ్ పార్టి) ఉపయోగించడం చేయరాదు. లీజుకు తీసుకున్న అన్ని పరికరాలు యూజర్ గైడ్/మాన్యువల్, ప్లేస్మెంట్ గైడ్ లైన్స్, డైరెక్షన్ లు, సూచనలు లేదా ఆక్వా ఎక్స్ఛేంజ్ ద్వారా అందించబడ్డ స్పెసిఫికేషన్ ల ప్రకారం ఖచ్చితంగా మెయింటైన్ చేయబడతాయి అని వారు అంగీకరించారు.

ఆక్వాఎక్స్చేంజ్ పరికరాలు మరియు సంబంధిత సేవలను ఉపయోగించడానికి అవసరమైన అన్ని కేబుల్స్, పానెల్స్, కెపాసిటర్స్ మరియు ఇతర సామాగ్రి అందించడానికి గల బాధ్యత కస్టమర్ దే అని అంగీకరించారు. ఆక్వాఎక్స్చేంజ్ పరికరాల నిర్వహణ మరియు వాటి పనితీరు పర్యవేక్షణ కొరకు ఆసైట్లో అమర్చబడిన డివైజెస్ లను పరిశీలించుటకు కంపెనీ సర్వహక్కులు కలిగి ఉన్నదని వినియోగదారుడు అంగీకరించారు. ఆక్వాఎక్స్చేంజ్ ద్వారా ఎప్పటికప్పుడు జారీ చేయబడ్డ అన్ని తదుపరి ప్రొడక్ట్ మాన్యువల్ లు, వీడియోలు, సూచనలకు మొదలైనవాటికి కస్టమర్ కట్టుబడి ఉంటానని అంగీకరించారు. సర్వీస్ పీరియడ్ లో ఆక్వాఎక్స్చేంజ్ పరికరాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించడానికి కస్టమర్ బాధ్యత వహిస్తారు. సర్వీస్ పీరియడ్ లో ఆక్వాఎక్స్ చేంజ్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయడం లేదా జోక్యం చేసుకోవడం చేయరాదని కస్టమర్ అంగీకరించారు.

పై నిబంధనలను ఉల్లంఘించడం ఈ ఒప్పందం యొక్క ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.

ఇన్ స్టలేషన్ మరియు బిల్లింగ్ సైకిల్

సాంకేతిక సాధ్యాసాధ్యాలకు లోబడి 7 పనిదినాల్లో కొత్త కనెక్షన్లను ఏర్పాటు చేయడానికి ఆక్వాఎక్స్చేంజ్ ప్రయత్నిస్తుంది. ఆక్వాఎక్స్చేంజ్ తన వినియోగదారులకు అర్ధ వార్షిక (6 నెలల) ప్రాతిపదికన బిల్లులను అందిస్తుంది. కస్టమర్ అందించిన సేవలకు పరిగణనలోకి తీసుకొని ఆక్వాఎక్స్చేంజ్ చెల్లించడానికి స్పష్టంగా కస్టమర్ అంగీకరించారు, దిగువ పట్టికలో పేర్కొనబడ్డ విలువ, కస్టమర్ ఆవరణలో అమర్చబడిన మొత్తం పరికరాల సంఖ్య ప్రకారం విలువ లెక్కించబడుతుంది.

కొత్త ఇన్ స్టలేషన్: ఇన్ స్టలేషన్ తేదీ తర్వాత ఏడు (7) రోజుల్లోగా కస్టమర్ కొత్త ఇన్ స్టలేషన్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఆక్వాఎక్స్చేంజ్ కాలనుగుణముగా ఇన్ స్టలేషన్ ఫీజుల యందు మార్పు చేయుటకు సర్వహక్కులు కలిగి ఉంది.

పునరుద్ధరణ చెల్లింపులు: డివైజెస్ పునరుద్ధరణ గడువు తేదీ నుండి పదిహేను (15) రోజుల్లోగా కస్టమర్ డివైజెస్ పునరుద్ధరణ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కస్టమర్ నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేయకపోతే, కంపెనీ ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేయ హక్కును ఎల్లవేళలా కలిగి ఉంటుంది, పరస్పర సమ్మతి ద్వారాగాని లేదా చట్టపరమైన ప్రక్రియ ద్వారా కస్టమర్ ఆవరణ నుండి పరికరాలను రికవరీ చేసే హక్కును సంపూర్ణముగా కలిగి ఉంటుంది.

డివైజె స్థానచలనము మరియు సేవల పునరుద్ధరణ

వినియోగదారుడు ముందుగా అమర్చబడిన స్థానము నుండి డివైజెస్ ను మరొక స్థానానికి బదిలీ చేయదలిచిన పక్షములో ఆక్వాఎక్స్చేంజ్ ద్వారా నిర్ణయించబడ్డ స్థానచలనం (రిలోకేషన్) ఛార్జీలకు లోబడి, వినియోగదారుడు ఇతర ప్రదేశాలకు కనెక్షన్ బదిలీని అభ్యర్థించవచ్చు. బదిలీ తరువాత సేవల పునరుద్ధరణకు ఆక్వా ఎక్స్ఛేంజ్ నిర్ణయించిన విధంగా బకాయిలు మరియు ఇతర ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

గోప్యతా విధానం మరియు డేటా సంరక్షణ

ఆక్వాఎక్స్చేంజ్ ఈ ఒప్పందం కింద ఆక్వాఎక్స్చేంజ్ వ్యవస్థలో వినియోగదారుని సమాచారం అనగా కస్టమర్ నిర్వహించే అన్ని సాంకేతిక, వాణిజ్య మరియు ఉత్పాదక సమాచారం యొక్క గోప్యతకు హామీ ఇస్తుంది, దీని కోసం కంపెనీ సమాచార నష్టాన్ని నివారించడానికి డేటా రక్షణ కోసం యంత్రాంగాలను అభివృద్ధి చేసి మరియు అమలు చేస్తుంది. పైన పేర్కొన్న నిబంధన ఉన్నప్పటికీ, కస్టమర్ కు సంబంధించిన సమాచారం, డేటా లేదా డాక్యుమెంట్ల మూలాన్ని బహిర్గతం చేయకుండా, గణాంక ప్రయోజనాల కోసం కంపెనీ తన కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి అవసరమైన మెరుగైన పరిష్కారాల అభివృద్ధి కోసం ఈ సమాచారాన్ని ఉపయోగించడానికి కస్టమర్ యొక్క డేటాను సేకరించడానికి, ప్రాసెస్ చేయడానికి మరియు నిల్వ చేయడానికి కస్టమర్ స్పష్టంగా అంగీకరించారు.

ఒప్పందం రద్దు విధానం

ఆక్వాఎక్స్చేంజ్ సేవలను నిరంతరం ఉపయోగించడం అనేది ఈ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను అంగీకరించడాన్ని సూచిస్తుంది. సేవలపై అసంతృప్తిగా ఉన్న వినియోగదారులు లిఖితపూర్వకంగా కంపెనీకి తెలియజేయడం ద్వారా ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. టర్మినేషన్ (ఒప్పందం రద్దు) వల్ల కస్టమర్ ఎలాంటి బకాయి లేదా బకాయిల నుంచి విముక్తి పొందలేడు.

బాధ్యత యొక్క పరిమితి

ఏ పరిస్థితుల్లోనైనా, పరికరాలు మరియు అనుబంధ భాగాలు/విడి భాగాలు/ఉపకరణాల ఉంటే వాటి కారణంగా ఏర్పడిన ఏవైనా పరిణామాల వలన సంభవించిన, ఉదాహరణాత్మక, శిక్షాత్మక, లేదా ప్రత్యేక పరిణామాల నష్టాలకు, అనగా వనరుల నష్టం, డేటా నష్టం, వ్యాపార నష్టం లేదా లాభ నష్టం వంటి ఏవైనా నష్టాలకు కంపెనీ ఎట్టి బాధ్యత వహించదు.

నిబంధనలు మరియు షరతులు

ఆక్వాఎక్స్చేంజ్ కంపెనీ ఆక్వా కల్చర్ ఆపరేషన్ల సామర్థ్యము మరియు నిర్వహణను మెరుగుపరచడానికి IOT పరికరములను అందిస్తుంది. అయితే ఆక్వాఎక్స్చేంజ్ కంపెనీ మరియు దాని అనుబంధ సంస్థలు, IOT పరికరాలు మరియు సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థల మద్య కలిగే ఎటువంటి మిస్ కమ్యునికేషన్ లేదా టెలి కమ్యునికేషన్ సిగ్నల్ యొక్క అంతరాయము వల్ల కలిగే ఏవైన వైఫల్యాలు, నష్టాలు, లేదా నష్టానికి కంపెనీ ఎటువంటి బాధ్యత వహించదు. IOT పరికరాల పనితీరు పూర్తిగా మొబైల్ నెట్‌వర్క్ సేవలు మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ పనితీరు పై ఆధారపడి ఉంటుంది. ఈ సేవల యొక్క ఎలాంటి అంతరాయము, ఆలస్యము లేదా వైఫల్యము వలన IOT పరికరాల పనితీరు పై ప్రభావము చూపితే అవి ఆక్వాఎక్స్చేంజ్ కంపెనీ నియంత్రణలో లేనివి. నెట్‌వర్క్ వైఫల్యము కారణముగా తలఎత్తే సమస్యలకు ఆక్వాఎక్స్చేంజ్ కంపెనీ బాధ్యత వహించదు.

సరియైన నిర్వహణ మరియు ఆపరేషన్ నిబంధనల ప్రకారం IOT పరికరాలను ఉపయోగించడం వినియోగదారుని బాధ్యత. తగిన విధముగా వాడకపోవడం , అనధికార మార్పులు లేదా నిర్లక్ష్యం కారణముగా పరికరముల వైఫల్యం లేదా పనితీరు సమస్యలకు ఆక్వాఎక్స్చేంజ్ కంపెనీ బాధ్యత వహించదు.

ఆక్వాఎక్స్చేంజ్ కంపెనీ తమ నియంత్రణకు మించి ఉన్న పరిస్థితుల కారణంగా ఏవిధమైన వైఫల్యాలకు లేదా ఏదేని కారణము వలన కలుగు నష్టములకు బాధ్యత వహించదు. వీటిలో ప్రకృతి వైపరీత్యాలు, దైవిక ఘటనలు , ఉగ్రవాద చర్యలు , ప్రభుత్వ నిబంధనలు మరియు నియంత్రణలు లేదా విద్యుత్ సరఫరా అంతరాయాలను ఆక్వాఎక్స్చేంజ్ కంపెనీ తమ నియంత్రణలో లేని పరిస్థితులుగా పరిగణించబడతాయి. IOT పరికరాల దుర్వినియోగం లేదా మిస్ కమ్యునికేషన్ వల్ల తలెత్తే ఏవైన దావాలు, నష్టాలకు లేదా ఇందు నిమిత్తమైన ఖర్చులకు ఆక్వాఎక్స్చేంజ్ కంపెనీ ఏవిధమైన బాధ్యత వహించదు.

వినియోగదారుని సహకారం

సేవలో కలుగు అంతరాయాలు మరియు సేవా సమస్యలు సమర్ధవంతము గాను మరియు వేగవంతము గాను పరిష్కరించడానికి , వినియోగదారు సంపూర్ణ సహకారము మరియు అవసరమైన సమాచారము కంపెనీకి అందించాలి. వినియోగదారుడు తమ సమస్యలను ఈక్రింది మాధ్యముల ద్వార సమాచారం అందించుటకు అంగీకరించారు.

కస్టమర్ కేర్ ఫోన్ నంబర్ :- 1800 102 2379
కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ :- 833 103 2442
కస్టమర్ కేర్ ఇమెయిల్:- [email protected]

సర్వీస్/సేవా పరిమితులు

ఆక్వాఎక్స్చేంజ్ డివైజెస్ లకి సంబంధించి తలెత్తే ఏవిధమైన సాంకేతిక సమస్యలైనా 48 గం నుండి గరిష్టముగా 7 రోజులలో పరిష్కరించడానికి కట్టుబడి ఉంటుంది.

డిస్క్లైమర్

ఆక్వాఎక్స్చేంజ్ సేవలను పూర్తి సమయం అంతరాయాలు లేకుండా నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది కాని అంతరాయం లేని సేవలకు హామీ ఇవ్వదు. కంపెనీ ఉత్పత్తులు ఏ వాతావరణంలో ఖచ్చితమైన సమాచారం అందిస్తుందనే దానికి కంపెనీ ప్రాతినిధ్యం వహించదు లేదా హామీ ఇవ్వదు. కస్టమర్ తన స్వంత విచక్షణ మరియు రిస్క్ పై కంపెనీ ఉత్పత్తులు మరియు సంబంధిత సమాచారం మరియు సేవలను ఉపయోగించాలి. కంపెనీ ఉత్పత్తులు మరియు సంబంధిత సమాచారం మరియు సేవలను ఉపయోగించడం వల్ల కలిగే ఏదైనా పూర్తి నష్టం లేదా నష్టాలకు కస్టమర్ పూర్తిగా బాధ్యత వహిస్తాడు.

డిక్లరేషన్

పైన పేర్కొన్న అన్ని నిబంధనలు మరియు షరతులను చదివి అర్థం చేసుకున్నట్లు నేను/మేము, కస్టమర్గా ధృవీకరిస్తున్నాము.

నేను/మేము మినహాయింపు లేకుండా మా మొబైల్ నంబర్ TRAI నిబంధనల ప్రకారం DND/NCPR జాబితాలో నమోదు చేయబడినప్పటికీ, నేను/మేము కస్టమర్ గా మొబైల్ నంబర్‌లో అన్ని కమ్యూనికేషన్‌లను స్వీకరించడానికి అంగీకరిస్తున్నాము మరియు సమ్మతిస్తున్నాము.

నేను/మేము మినహాయింపు లేకుండా అన్ని నియమనిబంధనలను అంగీకరిస్తున్నాం. ఆక్వా ఎక్స్ఛేంజ్ యొక్క సేవలకు సబ్ స్క్రైబ్ చేయడం ద్వారా, ఆక్వా ఎక్స్ఛేంజ్ యొక్క సర్వీస్ ఆఫర్ కు నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను.

Click here For Powermon set Lease Terms & Conditions in English